Sidebar


Welcome to Vizag Express
పనులు వేగవంతం చేయండి

03-02-2025 20:28:17

పనులు వేగవంతం చేయండి 

 ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 3

 రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్లక్ష్యం వహించకుండా వేగవంతం చేయాలని రైల్వే జిఎం పరమేశ్వర్ పంక్వాల్ అధికారులకు సూచించారు. సోమవారం ఇచ్చాపురం పర్యటనలో భాగంగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం రైల్వే క్వార్టర్స్ పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ను ప్రారంభించారు. ఇచ్చాపురం రైలు నిలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్సీ నర్తు రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మి, జెడ్ఆర్యుసిసి మెంబర్ శ్రీనివాస్ రౌలో  వినతి పత్రాలు అందజేశారు. ప్రధాన రైలు నిలుపుదల చేయాలని, నార్త్ క్యాబిన్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని, బహుద నది సమీపంలో సౌత్ క్యాబిన్ వద్ద అండర్ పాస్ నిర్మాణం, నార్త్ క్యాబిన్ టు రోడ్డు ఎక్సటెన్షన్ చేయాలని, స్టేషన్లో ఎక్స్ లెటర్ సదుపాయం కల్పించాలని కోరారు. స్పందించిన జీఎం అన్ని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం భజానా, చీఫ్ హెల్త్ ఆఫీసర్ రవికుమార్, స్టేషన్ మాస్టారు హెచ్ కే సాహు, బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  బుద్దాల నిర్మలా రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సాయి కామేష్, కాళ్ళ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.