Sidebar


Welcome to Vizag Express
అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా చదువుల పండుగ!

03-02-2025 20:37:39

అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా చదువుల పండుగ!

పి. గన్నవరం, వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 3:
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం అయినవిల్లిలో  స్వయంభు గా వెలిసి ప్రసిద్ధిగాంచిన   వినాయకుని ఆలయంలో ఆదివారం మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి సందర్భంగా చదువులకు ఆది గురువు అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి సప్తనదీ జలాలతో రుద్రాభిషేకం, సరస్వతీ పూజ, లక్ష కలముల సమర్పణ చేశారు. లక్ష కలముల మహోత్సవం సందర్భంగా ఆలయ సిబ్బంది అని ఏర్పాట్లు చేశారు, పూజ చేసిన పెన్నుల కొరకు  అధిక సంఖ్యలో భక్తులు, పాల్గొన్నారు. భక్తుల విరాళాలతో50,000 పెన్నులు భక్తులకు విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేపడుతున్నారు, ఆలయ అర్చకులు స్వామివారికి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పూర్ణ అలంకరణతో స్వామివారు దర్శనం ఇచ్చారు.