Sidebar


Welcome to Vizag Express
సూర్య దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం

04-02-2025 21:19:11

సూర్య దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం 

భీమిలి ఎమ్మెల్యే గంటా

భీమునిపట్నం వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 4: సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలోని సూర్య భగవానుడి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కృష్ణాపురం గోశాల సమీపంలోని సూర్యనారాయణ స్వామి వారిని రథసప్తమి సందర్భంగా మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019లో తాను మంత్రిగా ఉన్నప్పుడు స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. రథసప్తమి రోజునే కాకుండా ఆదివారాల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోందని, రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయి సూర్య దేవాలయంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.   సూర్య భగవానుడి దర్శనానికి వచ్చిన గంటా శ్రీనివాసరావుకు ఏ.ఈ.ఓ. ఎన్.ఆనంద్ కుమార్, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ విక్రమ్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.వి.నరసింహం, టీడీపీ వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు సిరిపురపు సురేష్, గుసిడి అవినాష్, నాగరాజు తదితరులు ఆయన  వెంట ఉన్నారు