04-02-2025 22:03:58
వైజాగ్ ఎక్స్ ప్రెస్, పొందూరు, ఫిబ్రవరి 4, క్యాన్సర్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. పొందూరు మండల కేంద్రం లో గల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ ఉదయలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు మారుతున్న విధానాలు, చెడు అలవాట్లు, రేడియేషన్ ,ప్లాస్టిక్ వినియోగం వంటి అలవాట్ల వల్ల ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని,మంచి జీవన విధానాలు విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని ఆమె సూచించారు.