05-02-2025 19:21:26
కళా వెంకటరావు ని పరామర్శించిన గజపతి రాజు విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ ఫిబ్రవరి 05తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు సోదరులు కిమిడి సత్యనారాయణ నాయుడు ఇటీవల స్వర్గస్తులైన కారణంగా ఈరోజు కిమిడి కళావెంకటరావు మరియు వారి కుటుంబ సభ్యులను రేగిడి గ్రామంలో వారి స్వగృహంలో పరామర్శించిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు . ఈ సందర్బంగా కిమిడి సత్యనారాయణ నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా విజయనగరం నియోజకవర్గం పార్టీ నాయకులు పాల్గొన్నారు.