05-02-2025 20:02:49
అవార్డు గ్రహీతలకు సత్కరించిన ఫైలు దేవదాసు రెడ్డికంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 5: జనవరి 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు బెంగళూరులో జరిగిన హ్యాక్తాన్ సైన్స్ ప్రాజెక్ట్ పోటీల్లో కంచిలి మండలంలోని ఎం ఎస్ పల్లి మోడల్ ఆదర్శ పాఠశాలకు ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. పాఠశాలలో గల ఐదుగురు విద్యార్థులకు స్థానిక ఎంపీపీ పైల దేవదాసు రెడ్డి సందర్శించి అవార్డు గ్రహీతలకు స్వీట్ తినిపిస్తూ దుస్సాలు వాళ్ళతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం తరఫున రెండు టీముల్లో ఒకటైన ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్ కావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని సుమారు ఐదు రాష్ట్రాలు లో గల విద్యార్థులు ప్రాజెక్టులో పాల్గొనగా తాము రూపొందించిన మోనాటరింగ్ పరికరాన్ని ఇన్నోవేషన్ అవార్డు లభించడం మా ప్రాంతానికి ఇలాంటి గుర్తింపు తేవడానికి కృషిచేసిన ఆధ్యాపక సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ తో పాటు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు ఆశీర్వచనాలు తెలిపారు