06-02-2025 21:10:05
నులిపురుగుల మందుతో రక్తహీనత నివారణ ముంచంగిపుట్టు,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,06: నులిపురుగుల మందు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చని సంవత్సరంలో రెండు సార్లు నులిపురుగుల మందు తప్పనిసరిగా తీసుకోవాలని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఇన్చార్జి అభివృద్ధి అధికారి సూర్యనారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 10న రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారన్నారు.3 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వయసు గల పిల్లలందరూ నులిపురుగుల మందు (ఆల్బండ జోల్ 400 ఎంజి) తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రక్తహీనత రాకుండా దోహదపడుతుందని ఆయన తెలిపారు. సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేవన్నారు. ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు వయసు గల పిల్లలు టాబ్లెట్ ను రెండు భాగాలుగా చేసి సగభాగం వేసుకోవాలని ఆయన తెలిపారు. ఈనెల 10వ తేదీన అందుబాటులో లేక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు తాత్కాలికంగా మందును వేసుకోవద్దని అందుబాటులో ఉన్న వైద్యాధికారులకు సంప్రదించి మందు తీసుకోవాలని ఆయన తెలిపారు. తిరిగి మళ్లీ 17 వ తారీకు న మందు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా నులిపురుగుల మందును పిల్లలకు వేయించాలని ఆయన తెలియజేశారు.