సమాజంలో మార్పు సాధ్యమేనని నిరూపిస్తున్న సేవా కార్యక్రమాలు
-సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసిన గోలుసుపూడి బ్రదర్స్
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6:
ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతులు మిన్న.. సహాయం చేయటానికి ఉండాల్సింది డబ్బు కాదు… సాయం చేసే మనస్సు’ అన్న సేవామూర్తి మదర్ థెరిస్సా సూక్తులను స్ఫూర్తిగా తీసుకున్నారు గొలుసుపూడి బుజ్జి (కూరగాయల దుకాణం).గత కొన్ని సంవత్సరాలు క్రితం యలమంచిలి వచ్చి కూరగాయల దుకాణం ప్రారంభించారు.వాక్చాతుర్యం,నాణ్యమైన కూరగాయలను సరసమైన ధరలకే ప్రజలకు అందివ్వడంతో క్రమేపి వ్యాపారం విస్తరించిండాన్ని, ఇదొక సువర్ణ అవకాశంగా భావించి,సేవా కార్యక్రమాలను చేయడం మొదలుపెట్టారు.ప్రజలు ఎవరైనా ఏదైనా విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తనకు తెలిసిందంటే చాలు అక్కడికి వెళ్లి, వాళ్ళకి తన అవకాశం ఉన్నంతలో సహాయం చేయడానికి ముందుంటారు.సేవా కార్యక్రమాల్లో భాగంగా యలమంచిలి టిడ్కో కాలనీతో పాటూ నూకాల తల్లి గుడి, రామచంద్రమ్మ గుడి,ఎన్జీవో హోమ్ వద్ద,సైతారుపేట, గొల్లలపాలెం గ్రామంలోను మొత్తం సుమారు రూ.లక్ష 20వేలతో ప్రజలు కూర్చోవడానికి సదుపాయంగా ఉండేటట్టు 40 సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు.యలమంచిలిలో స్థిరపడిన గొలుసుపూడి బుజ్జి ఎప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.