Sidebar


Welcome to Vizag Express
బాల్య వివాహాలను అరికట్టాలి

06-02-2025 21:33:24

బాల్య వివాహాలను అరికట్టాలి 


 పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 6 :

బాల్య వివాహాలు ను అరికట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా  సూపరిండెంట్ ఆఫ్ పోలీస్  మాధవ రెడ్డి   జిల్లా మహిళా  చైల్డ్ వెల్ఫేర్, సాధికారిక అధికారి తోట కనకదుర్గ  జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. వారి చేతుల మీదుగా  జిల్లా బాలల సంరక్షణ లైంగిక దాడులు నివారణ గోడ పత్రికలను ఆవిష్కరించారు. పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఆఫీసు కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లామహిళ శిశు సంక్షేమ శాఖ  ప్రాజెక్టు డైరెక్టర్  టి. కనకదుర్గ  ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.మన్యం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్ తోట కనకదుర్గ మాట్లాడుతూ   జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ - సబ్ ఇన్స్పెక్టర్లు,మహిళా పోలీస్ లు,స్టేషన్ హౌస్ ఆఫీసర్, సి డి పో లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అదే విధంగా మన్యం జిల్లాలో  బాల్యవివాహాలు  నివారణ కొరకు  జీవో నెంబర్ 31,39  ప్రకారంగా  జిల్లాలో ఉన్నటువంటి అధికారులు  స్టేషన్ హౌస్ ఆఫీసర్, మహిళా సంరక్షణ కార్యదర్శి లు చైల్డ్ మ్యారేజ్ ప్రొబ్షన్ ఆఫీసర్లుగా ప్రభుత్వము నియమించింది. బాల్యవివాహాల  నివారణ అధికారులు మహిళా పోలీసీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, గ్రామ సెక్రెటరీ వీఆర్వో, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సిడిపిఓ, బాల్యవివాహాల నివారణ అధికారులు గా విధులు నిర్వహించాలని అవగాహన కల్పించారు.అదేవిధంగా గ్రామస్థాయిలో  బాల్య వివాహాల నివారణ అండ్ మౌనిటింగ్ కమిటీలు గ్రామస్థాయిలో ఫార్మేషన్ అయ్యాయి వాటిని బలోపేతం చేసి ఫంక్షనింగ్ అయ్యే విధంగా గ్రామస్థాయి సిబ్బంది కృషి చేయాలని కొనియాడారు. అదేవిధంగా  కిషోర్ వికాసం ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలలో ఉన్నటువంటి కౌమర దశలో ఉన్నటువంటి బాలబాలికలను గుర్తించి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి మరల వారిని ఆరోగ్యము  విద్యా మరియు న్యూట్రిషన్ గ్రోత్, రక్తహీనత, లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ డిఫెన్స్, లైంగిక దాడులు పై,ఋతు చక్ర పరిశుభ్రత  మొదలగు విషయాలపై అవగాహన చేయడము మరియు గ్రామస్థాయిలో గ్రామ పిల్లల సంక్షేమ  పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా పిల్లలు దిశ నిర్దేశం చేయాలని మహిళ కార్యదర్శిలకు తెలియజేయడం జరిగింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి  అల్లు  సత్యనారాయణ   మాట్లాడుతూ గ్రామస్థాయిలో  బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి బడిలోకి చేర్చాలని అదేవిధంగా పిల్లలు వారి యొక్క కోరిక మేరకు  వృత్తి విద్యా కోర్సులను ఎడ్మిట్ చేయాలని కోరారు. అదేవిధంగా పిల్లపై జరిగే లైంగిక దాడులను అరికట్టాలని గ్రామస్థాయిలో ఉన్నటువంటి హై స్కూల్స్ జూనియర్ కాలేజీల్లో ఉన్నటువంటి ఆడ మగ పిల్లలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.జిల్లాలో  అనధికార దత్తత  జరగకుండా చూడాలని, ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి లైంగిక దాడులను అరికట్టాలని మన జిల్లాలో మండలాల్లో ఎక్కడ కూడా ఎలాంటి లైంగిక దాడులు జరగకుండా పిల్లలందరికీ పిల్లలు  చట్టాలపై అవగాహన చేయాలని మహిళా కార్యదర్శిలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆఫీస్ నుంచి సిఐలు, ఎస్ఐలు  జిల్లా బాలల సంరక్షణ విభాగం  లీగల్ కం ప్రొబిషన్ అధికారి పి.శ్రీధర్ హాజరవడం జరిగింది