06-02-2025 21:55:02
వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మండల విద్యాశాఖ అధికారి కె అప్పారావు అన్నారు. గురువారం అమీన్ సాహెబ్ పేట ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షించారు. విద్యార్థుల తెలుగు అభ్యసన, సామర్ధ్యాలను పరిశీలించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీఎం పోషణ రాగి జావ విద్యార్థులందరూ సమంగా తీసుకోవాలని సూచిస్తూ ఎంఈఓ విద్యార్థులతో కలిసి రాగిజావ తాగుతూ వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం పాఠశాలలో రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు