Sidebar


Welcome to Vizag Express
ఉత్సాహంగా మహిళా క్రికెట్ టోర్నీ

06-02-2025 21:56:13

ఉత్సాహంగా మహిళా క్రికెట్ టోర్నీ 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6


 ఇచ్చాపురం సూరంగి రాజా మైదానంలో చదివిన అంతర్రాష్ట్ర మహిళ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుపై ఒడిశా జట్టు విజయం సాధించింది. గురువారం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చాపురం క్రికెట్ క్లబ్ సౌజన్యంతో ఆంధ్ర ఒడిశా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్రప్రదేశ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఒరిస్సా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి విజయం సాధించింది. చేసిన ఒరిస్సా జట్టుకు  చెందిన జూలీ బెహరాకు  మ్యాన ఆఫ్ మ్యాచ్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐసిసి క్లబ్ గౌరవ అధ్యక్షులు దాసరిరాజు, జిల్లా క్రికెట్ సంఘం చీఫ్ కోచ్ సుదర్శన్, జిల్లా కలెక్టర్ కె కిరణ్, జిల్లా క్రికెట్ సంఘ మేనేజర్ జీవి నాయుడు, సంఘ కార్యదర్శి బెనర్జీ, గోపి బత్తుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు