06-02-2025 21:57:22
ఏఎంసీ నుండి బస్టాండ్ వరకు రహదారికి నిధులు మంజూరుపొందూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్ ,ఫిబ్రవరి 6.కూటమి సర్కారు సారథ్యంలో పొందూరు మేజర్ పంచాయతీ అభివృద్ధి పుంతలు తొక్కుతుంది. ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవి కుమార్ చొరవతో మండల కేంద్రమైన పొందూరు బచ్చల వీధి, లావేటి, కొండక, గొల్ల వీధులతో పాటు,అక్కమాంబ టెంపుల్ నుండి కాకర్ల నర్సింగ్ హెూమ్, రామ్మోహన్ నగర్ దగ్గర కాలనీ నుండి పెద్ద చెరువు రోడ్డు వరకు మంజూరు చేసి శరవేగంగా పనులు జరుగుపుటకు శ్రీకారం చుట్టారు. ఏఎంసీ కార్యాలయం జంక్షన్ నుండి బస్టాండ్ వరకు ఒకటి75 కోట్ల మంజూరుతో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు కొలతలను వేయడంతో ఈ ప్రాంత ప్రజలు అనంద ఉత్సవాలు వెళ్లి విరిశాయి.