06-02-2025 21:59:57
సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6 సాంకేతిక వైజ్ఞానిక రంగాలలో రాణించాలంటే టెన్త్ విద్యార్థులు సైన్స్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అవగాహన పెంచుకోవాలని సహలాల పుట్టుగా జడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ప్రమోద్ కుమార్ పాడి అన్నారు. గురువారం కొలిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్ఎం నరేంద్ర కుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయులు 25 అంశాలకు చెందిన సైన్స్ ప్రయోగాలు చేసి విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పి శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు.