07-02-2025 22:03:25
అభిందించిన అశోక్ విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ ఫిబ్రవరి 07ఉత్తరాఖండ్ లో జరిగిన 38వ జాతీయ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ 87 కేజీల విభాగంలో కాంస్య పతాకం సాధించిన విజయనగరం క్రీడాకారిణి కుమారి టి. సత్య జ్యోతిని మరియు సీనియర్ మహిళల 71 కిలోల విభాగంలో బంగారు పతాకం సాధించిన కొండవెలగాడకు చెందిన శనపతి పల్లవి ఈరోజు తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు , శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు లను కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాబోయే యువ క్రీడకారులకి ఆదర్శంగా నిలిచి మన రాష్ట్రానికి మరియు మన జిల్లాకి ఖ్యాతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.