09-02-2025 03:01:44
సమస్య విన్నారు పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే విజయ్ చంద్రపార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 వరకు నిర్వహించిన ప్రజా దర్బార్ కు మంచి స్పందన కనిపించింది వివిధ గ్రామాలకు చెందిన చెందిన మహిళలు, నిరుద్యోగ యువత, పెద్దలు అధిక సంఖ్యలో హాజరై వినతలు సమర్పించారు.ప్రతి ఒక్కరి సమస్య క్షుణ్ణంగా ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. తమ సమస్యలు విన్నవించుకొనే అవకాశం కల్పిస్తున్న ఎమ్మెల్యేకు బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.