09-02-2025 03:19:08
అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో పెన్నులు వితరణ మహోత్సవము అయినవిల్లి, వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 7:డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి లో చదువుల పండుగసందర్భంగా కలముల వితరణ మహోత్సవము జరిగింది. ఆలయ కమిషనర్ సత్యనారాయణ రాజు చేతుల మీదుగా వేలాదిగా తరలివచ్చిన విద్యార్థిని, విద్యార్థులు, భక్తులకు,విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాలములు ను వితరణ కార్యక్రమం నిర్వహించారు, భక్తుల సౌలభ్యం కొరకు శనివారం, ఆదివారం, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేక దర్శనాలన్నీ పూర్తిగా రద్దు చేశారు .కేవలం ఉచిత సాధారణ దర్శనం మాత్రమేనని ఆయన అన్నారు. పెన్నులు స్వీకరించిన విద్యార్థిని విద్యార్థులు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.