09-02-2025 08:26:42
వేడుకగా భీష్మ ఏకాదశి పూజలుఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8 పట్టణంలో భీష్మ ఏకాదశి పూజలు అత్యంత వేడుకగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయాలు, శివాలయాలు కిటకిటలాడాయి. శనివారం పెద్ద జగన్నాథ స్వామి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అనంతరం ప్రత్యేకంగా తులసి మాలలతో అలంకరించి మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళల కుంకుమ పూజలు జరిపారు. సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు వేకుజాము నుండే ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు .