09-02-2025 08:36:38
స్పీకర్ క్షమాపణ చెప్పాలిమందస, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8: ఆదివాసీ ల భూములకు రక్షణగా ఉన్న 1/70చట్టాన్ని సవరించాలని,ఆదివాసీలకు, ఆదివాసీ చట్టాలను అవహేళన చేస్తూ మాట్లాడడం విడ్డురంగా ఉందని, బహిరంగ ప్రదేశంలో ఆదివాసీలకు అవహేళన చేసి మాట్లాడిన స్పీకర్ క్షమాపణ చెప్పాలని ఆయన పై ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని ఆయన వాక్యాలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఎ సి ఆధ్వర్యంలో ఈ నెల 11,12 న ఏర్పాటు చేసిన ఏజెన్సీ బంద్ కు ఆదివాసీ వికాస పరిషత్ సంపూర్ణ మద్దత్తు తెలుపుతుందని ఆయన వాక్యాల పైకూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని,ఆదివాసీ వికాస పరిషత్ అధ్యక్షులు సవర జగన్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు