రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

4/29/2022 7:34:58 PM

మధురవాడ: ఎక్స్ ప్రెస్ న్యూస్:  ఏప్రిల్ 29
జాతీయ రహదారి సీఎం ఆర్ గార్డెన్స్ కొమ్మాది కూడలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండ్రు గోవింద రావు, కొండ్రు సన్యాసిరావు ఇద్దరు సోదరులు కలసి ద్విచక్ర వాహనం పై బోయపాలెం నుండి నగరానికి- పూర్ణ మార్కెట్ వెళ్తుండగా ఎన్ ఆర్ గార్డెన్స్ ఎదురుగా లారీ ఢీకొట్టడంతో సన్యాసిరావు 42 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ వ్యాపారం చేస్తున్నాడు. గోవింద కు చిన్న చిన్న గాయాలు అయితే చికిత్స పొందుతున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు కేజీహెచ్కు తరలించారు. సీఐఏ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Name*
Email*
Comment*