అలరించిన "భక్తి రంజని" 108 భక్తి పాటల కార్యక్రమం

10/3/2022 10:45:02 PM

సంబేపల్లి: ఎక్స్ ప్రెస్ న్యూస్; అక్టోబర్ 3; 
శరన్నవరాత్రి దసరా ఉత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, సంబేపల్లి మండలం లో వెలసిన దేవర రాయి నల్ల గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన భక్తి రంజని 108 భక్తి పాటలు కార్యక్రమం భక్తులను ఎంతో అలరించింది .సోమవారం నల్ల గంగమ్మ తల్లి ఆలయంలో మన సంస్కృతి కళా సంస్థ తిరుపతి వారిచే భక్తి రంజని పాటల కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమం ఆలయ కమిటీ  చైర్మన్ మురళి స్వామి, ఈవో కొండారెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను వెలికి తీస్తున్న తిరుపతి మన సంస్కృతి కళా సంస్థ అధ్యక్షుడు రంగాని సహదేవ నాయుడు, కార్యదర్శి కలకట రెడ్డప్పలను అభినందించారు. ప్రాచీన కళలు అంతరించకుండా నేటికీ బ్రతికి ఉన్నాయంటే అందుకు నిదర్శనం ఇటువంటి కళాకారుల గొప్పతనం అన్నారు . తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుండి కళాకారులు పాల్గొని  భక్తి పాటలు ఆలపించారు. సంస్థ తరఫున ముఖ్య అతిథులకు, కళాకారులకు దృశ్యాలువాకప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రంగాని సహదేవ నాయుడు, కలకట రెడ్డప్ప, గౌరవాధ్యక్షులు జానం గంగిరెడ్డి, కళాకారుడు బండి ఈశ్వర్, సర్పంచ్ అంచల రామచంద్రయ్య, ఎంపిడిఓ నరసింహులు, ఏ.ఎస్.ఐ వెంకటసుబ్బయ్య, భువనేశ్వర రెడ్డి, , నాగరాజ స్వామి, భక్తులు, కళాకారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*