జనసేనతో పొత్తు కొనసాగుతోంది సోము వీర్రాజు

2/18/2023 8:28:59 AM

చీరాల: భాజపాలో కార్యకర్తగా చేరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని.. తానేంటో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకే భాజపాను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక పార్టీలో వ్యక్తి పెత్తనం ఎక్కువైపోయిందని.. వర్గాలుగా చీలిపోయేలా వ్యవహరించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..
జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. ''విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వారాహికి పూజ సమయంలో భాజపా పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్ వైకాపా ప్రభుత్వానికి 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే, అన్ని పథకాలకు తామే నిధులు ఖర్చుపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం శోచనీయం'' అని సోము అన్నారు..

Name*
Email*
Comment*