ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన ఫలితాలను చవిచూసింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్ని తానై విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ.. ఆ పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థానాల సంఖ్య సింగిల్ డిజిట్‌ను మించలేదు. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా.. పంజాబ్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలోనూ ఉపశమనం లభించలేదు.