బూర్జ, ఎక్స్ ప్రెస్ న్యూస్, మార్చి 01: మండలంలో కొల్లివలస జంక్షన్లో ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం ప్రారంభించారు. అనంతరం కొల్లివలస, చీడివలస గ్రామాల్లో ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ పర్యటించారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీగా పి.వి.ఎన్ మాధవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో పట్టభద్రులను వారు కలిశారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మంత్రులను కలిసి పట్టభద్ర సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ వారికి హామీ ఇచ్చారు. అలాగే పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.