- విజయనగరం 1వ పట్టణ సీఐ వెంకటరావు వెల్లడి
విజయనగరం, ఎక్స్‌ప్రెస్ న్యూస్: విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ వద్ద వాహన తనిఖీలను విజయనగరం 1వ పట్టణ పోలీసులు చేపట్టి, గంజాయి తరలిస్తున్న మహిళతో సహా ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండుకు తరలించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే విజయనగరం 1వ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారంతో మార్చి 14, రాత్రి రైల్వే స్టేషను కూడలిలో వాహన తనిఖీలు చేపట్టారు. మార్చి 15 తెల్లవారు జామున ఒడిశా రాష్ట్రంకు చెందిన ముగ్గురు వ్యక్తులు బ్యాగులతో రైల్వే స్టేషను సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తుండగా, సిఐ బి. వెంకటరావు, వారి సిబ్బంది ఆపి, బ్యాగులు తనిఖీ చేయగా, ఆ బ్యాగుల్లో 20 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వారిని ప్రశ్నించగా తాము ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన వారమని, డబ్బులు సంపాదించుకోవాలనే ఆశతో తమ రాష్ట్రం నుంచి గంజాయిని తరలిస్తున్నామని తెలిపారన్నారు. వీరి ముగ్గురు పేర్లు.. (ఎ-1) నిందితుడు కోరాపుట్ జిల్లా నారాయణపట్న బ్లాక్ బర్లి గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ కోస,
(ఎ-2) నిందితుడు కోరాపుట్ జిల్లా దమన్ జోడికి వ్యక్తికాగా, (ఎ-3) నిందితుడు కోరాపుట్ జిల్లా దమన్ జోడికి చెందిన తులసీ కులదీప్‌గా వెల్లడిరచారన్నారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్‌ఐలు రామ గణేష్, భాస్కరరావు, ఎఎస్‌ఐ మన్మదరావు, హెడ్ కానిస్టేబుల్ ఎ.వి.రమణ, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.