ప్రియురాలు పట్టించుకోలేదని ఆత్మహత్యాయత్నం

3/20/2023 2:04:57 PM


గుడివాడ వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి సెంటర్ కు చెందిన 26 సంవత్సరాలు వయసు కలిగిన శైలెష్ సింగ్ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తన తండ్రి నిర్వహిస్తున్న టీ స్టాల్ లో తండ్రితో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాడు. ఈరోజు సాయంత్రం తను ప్రేమించిన అమ్మాయి కొద్ది రోజులుగా కొత్త ద్విచక్ర వాహనం మీద తిరగడంతో తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఆమెతో ఫోన్లో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆ యువతీ ఇంటికి వెళ్లి యువతి ఉంటున్న ఇంటి పై పోర్షన్ బాల్కనీ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని కేకలు విన్న ఆ పోర్షన్లో నివాసం ఉంటున్న వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అతను కాపాడి 108 వాహనములో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సగానికి పైగా అతని శరీరం కాలిపోవడంతో అతనిని మెరుగైన వైద్య చికిత్స కోసం మచిలీపట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Name*
Email*
Comment*