కేన్సర్_పేషంట్లకు_ప్రాణ_భిక్ష_పెట్టే_దేవాలయం..
హోమి బాబా కాన్సర్ పరిశోధన కేంద్రం
అగనంపూడి -అనకాపల్లి (అనకాపల్లి కి 5km దూరం )
టాటా హాస్పటల్ లో కేన్సర్ కు సంబందించిన అత్యున్నత నిపుణులైన డాక్టర్లు 10మంది కేస్ డిస్కస్ చేసి చావు అంచుకు వెళ్లిన వారిని కూడా బ్రతికిస్తారు.ఆరోగ్య శ్రీ కార్డ్,తెల్ల రేషన్ కార్డ్ వారికి ఉచితంగా వైద్యం చేస్తారు. మిగిలినవారికి కార్పొరేట్ హాస్పటల్ లో 15 లక్షలు ఖర్చు అయితే ఇక్కడ 50 వేలు అవుతుంది. ఇక్కడ డాక్టర్లు ,స్టాఫ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. హాస్పటల్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇది కేన్సర్ పేషంట్లకు ప్రాణ భిక్ష పెట్టే దేవాలయం లాంటిది.
ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ముంబై వారు నిర్వహిస్తున్న కేన్సర్ హాస్పటల్.
ముంబై లో కూడా టాటా కేన్సర్ హాస్పటల్ ఉంది.అక్కడ వందలాది మంది నిపుణులైన డాక్టర్ల తో సుమారు 200 ఎకరాల విస్తీర్ణం లో కేన్సర్ హాస్పటల్ టాటా గ్రూప్ వారు నడుపుచూ లక్షలాది ప్రాణాలు నిలుపు చున్నారు.
కలుషిత ఆహారం,వాతావరణం వలన మనము తరచు మనకు తెలిసిన వారు ఎవరొకరు కేన్సర్ రోగులను చూస్తున్నాం. చాలా కార్పొరేట్ హాస్పటల్స్ దానిని ఆసరాగా చేసుకుని అరకొర వైద్యం అందించి లక్షలాది రూపాయలు వసూలు చేసి,వారి ప్రాణాలు కూడా హరింప చేస్తున్నారు.
నోట్ : ఈ హాస్పిటల్ లో కొత్తగా వొచ్చేవారు, ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందాలని అనుకుంటే కొంచెం సహనం కావాలి. మొదటి రోజే డాక్టర్ ని కలవాలి అనే ఉత్సాహం ఉండకూడదు. కొంచెం ప్రాసెస్ కి టైమ్ పడుతుంది.
డాక్టర్స్, నర్సులు, ఇంకా ఇతర స్టాఫ్ చాలా చాలా ఫ్రెండ్లీ గా ఉంటున్నారు. మనకు చికిత్స కోసం అడిగే డౌట్ లను అర్థం అయ్యేలా చెప్తున్నారు
కాన్సర్ పేసెంట్ లు ఎవరైనా మీ దగ్గర్లో ఉన్నా, మీకు తెలిసిన వారైనా, మీ కుటుంబ సభ్యులు అయినా ఒకసారి ఈ ఆసుపత్రి కి తీసుకొనివెళ్ళండి.
వారి ప్రాణాలు కాపాడండి
మిగిలిన హాస్పిటల్ లో అంతంత మాత్రమే వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ తో అన్నీ ఉచితంగా అని ప్రకటన లు చేసి బ్లెడ్ టెస్టులు, స్కానింగ్ లు అంటూ డబ్బులు తీసుకుంటున్నారు
ఈ ఆసుపత్రి లో అన్నీ ఉచితంగా లభించును. ఆరోగ్య శ్రీ లేకుండా కూడా అతి తక్కువ ఫీజులతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు
ఈ ఆసుపత్రి గురించి మన ఆంధ్రప్రదేశ్ లో తక్కువ మందికి తెలుసు. ఇదే ఆసుపత్రి ని ఛత్తిస్గడ్, ఒరిస్సా రాష్టాల ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
ఈ విషయం షేర్ చేసి కాన్సర్ రోగులకు ఊపిరినివ్వండి