జనాలను హడలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్ సబ్యుడు అరెస్ట్..
ఏపీలోని పలుప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కరుడుగట్టిన దొంగలముఠా చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే.. పలువురు చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు తాజాగా..మరో ముందడుగు వేశారు. చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యుడు ప్రధాన సూత్రధారిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో విజయవాడ చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకి వంటి ప్రాంతంలో చెడ్డి గ్యాంగ్.. భారీగా చోరీలకు పాల్పడింది. వరుస దొంగతనాలు చేస్తూ హడలెత్తించింది.
వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ముఠాను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నలుగురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన బెజవాడ పోలీసులు.. ప్రధాన సూత్రధారి కోసం అన్వేషిస్తున్నారు. అప్పటి నుంచి చెడ్డి గ్యాంగ్ ముఠాలోని కీలక సభ్యుడు.. తప్పించుకుని తిరుగుతున్నాడు.
నిందితులు ఇచ్చిన సమాచారంతో.. చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యుడు కోసం ప్రత్యేక బృందాలతో బెజవాడ పోలీసులు గాలించారు. ఈ క్రమంలో బెజవాడ పోలీసులు బెంగుళూరులో అరెస్ట్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.