తిరుపతి జిల్లా,పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ గేటుపుత్తూరులో పాత తిరుపతి రోడ్డు నందు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి ఆదివారం ఉదయం మత్తుమందు ఇచ్చి అపహరణకు గురి చేస్తుండగా స్థానికులు గుర్తించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. హుటాహుటిన ఘటన స్థలానికి ఎస్సై గౌరీ శంకర్ చేరుకొని విచారణ మొదలుపెట్టారు. బీహార్ కు చెందిన వ్యక్తి సంచిలో మత్తుమందు బిస్కెట్లు దొరికాయి. ఇతనితో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్,శబస్టాండు పరిసర ప్రాంతాలలో విస్తృత గాలింపు చేపట్టిన పోలీస్ శాఖ... ఎక్కడైనా సరే కొత్తగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ ప్రజలకు పోలీస్ శాఖ ఆదేశం... ఇంకా పూర్తి వివరాలు పోలీస్ దర్యాప్తులో తేలాల్సిఉంది...