*బస్సులో రూ.1.07 కోట్ల విలువైన బంగారం తరలింపు
* పోలీసులకు పట్టుబడిన నిందితుడు
ఏలూరు, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏప్రిల్: ఏలూరు విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చి అధికారులకు దొరికిపోతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు సమీపంలో జరిగింది. శనివారం తెల్లవారుజామున చెన్నై నుంచి తణుకు కు ఓ ప్రైవేటు బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు సమీపంలో కలపర్రు టోల్ ప్లాజా వద్ద కాకినాడ కస్టమ్స్ డివిజన్ అధికారులు ఆ బస్సును ఆపి అందర్ని, అలాగే వారి సామన్లను తనిఖీలు చేశారు.
అయితే ఓ వ్యక్తి వద్ద దాదాపు రూ.1.07 కోట్ల విలువైన 1784.5 గ్రాముల బంగారం దొరికింది. దీన్ని విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారంగా అధికారులు గుర్తించారు. కస్టమ్స్ చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆదివారం రోజున విశాకపట్నంలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో నిందితుడ్ని ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు.