అంబాజీపేట ఎక్స్ ప్రెస్ న్యూస్, ఏప్రిల్: చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి, నగదు, స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సి.హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, కొత్తపేట డీఎస్పీ కె.వి రమణ ఆధ్వర్యంలో పి.గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ పర్యవేక్షణలో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి కె.వి రమణ మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడి వరస దొంగతనాలకు పాల్పడిన కట్ట అర్జున్, ధర్మాడి దుర్గాప్రసాద్ లన మంగళవారం రాజోలు మండలం గెద్దాడ గ్రామం వద్ద నేషనల్ రోడ్డు హైవే పక్కన ఓఎన్జీసీ స్థలంలో పట్టుకున్నామన్నారు. వీరు నుంచి 3,81,000 నగదు, 7,40,000 రూపాయల విలువ గల 19 సవర్లు బంగారు వస్తువులు, 3,600 రూపాయల విలువ గల వెండి వస్తువులు. మొత్తం 11,24,000 రూపాయల విలువ గల నగదు, బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం రాజోలు జె ఎఫ్ సీఎం కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు.
ఈ కేసును అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి చాకచక్యంగా నిందితులను అరెస్టు చేయటంలో కీలక పాత్ర వహించిన పి.గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. ప్రశాంత్ కుమార్, నగరం పోలీసు స్టేషన్ ఎస్.ఐ, ఎస్.కె.జానీ బాషాని క్రైమ్ పార్టీ హెచ్.సి బి. శ్రీనివాస్, పీ.సీ డి.చిరంజీవి కృష్ణ, నగరం. పి.ఎస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.