కవిత రాగం

4/27/2023 7:09:29 AM

 శ్రమ తెలియని శ్రామికురాలు..!
తీర్చుకోలేని చిన్ని ఆశలు అందనంత దూరంలో  
నింగిలో మెరిసే నక్షత్రాల్లా ఊరిస్తుంటే...
 తను సుఖసంతోషాలను మరచి రక్త మాంసాలను   
కరిగిస్తూ తన అనుకునే వారికోసం ప్రతి క్షణం
శ్రమించే శ్రామికురాలు మగువ..!
ఆటవిడుపే... ఆదివారం అందరికీ
మగువకు తప్ప... చీకటి తీపి కలల్ని దాచుకొని...
అక్షయపాత్రే వలే అన్ని సమకూరుస్తూ
అందరినీ నిద్రపుచ్చి అలుపెరుగక ఉషోదయవేళ
 ఉదయించే నిరంతరం శ్రమించే శ్రామికురాలు మగువ..!
కష్టాలను  ఇష్టాలుగా స్వీకరించి కుటుంబ సభ్యులకు 
ప్రేమానురాగాలు పంచి తాను మాత్రం గుండెల్లో అనంతమైన  బాధను దాచుకొని...
కనులు తెరిచిన క్షణం నుండి చివరి దుప్పడి కప్పుకునే వరకు చెదరని చిరునవ్వుతో నిరంతరం శ్రమించే
 శ్రామికురాలు మగువ..!
పనిచేసే కార్మికులు పిడికిలెత్తి ఒక్కటైన రోజులా
కార్మికుల ఐక్యతకు నాంది పలికిన రోజులా
అవనిలా బాధ్యతలు మోసే మగువలకు కూడా చారిత్రాత్మక చైతన్యం రోజు రావాలని కోరుకుంటు....
కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
- మంజుల పత్తిపాటి (కవయిత్రి )
9347042218
యాదాద్రి భువనగిరి జిల్లా

Name*
Email*
Comment*