విజయవాడ, ఎక్స్ ప్రెస్ న్యూస్: విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, బాలకృష్ణ విచ్చేశారు. 2004 కృష్ణానది పుష్కరాల సందర్భంలో కృష్ణా జిల్లాకు వచ్చిన రజినీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలను ఈ పుస్తకాల్లో పొందుపరిచారు.