నంద్యాల, ఎక్స్‌ప్రెస్ న్యూస్ : నంద్యాల జిల్లా టీడీపీలో మరోసారి విబేధాలు భగ్గుమంటున్నాయి.. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆదే పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రంగా గాయపడ్డారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నంద్యాలలో భారీ భద్రత
నంద్యాలలో ఈ ఘటన ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. మరోవైపు.. దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు. ఘర్షణలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.