వలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు

5/20/2023 9:35:17 AM

వలంటీర్లకు వందన కార్యక్రమంలో
   సీఎం జగన్‌

గ్రామ/వార్డు వలంటీర్ల సేవలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. సంక్షేమ సారథులని కితాబిచ్చారు. వీరు సేవలకు గుర్తింపుగా.. వరుసగా మూడో ఏడాది కూడా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. 

అమరావతి, ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ : రాష్ట్రంలో సంక్షేమ సారథులు వాలంటీర్లు అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశంసించారు  ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి తలుపు తట్టి పింఛన్‌ అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని.. కానీ ఇప్పుడు మాత్రం పింఛన్‌తో రేషన్‌ డోర్‌ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు అదేలా వాలంటీర్ల సేవలు చేస్తున్నారన్నారు.
వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను వాలంటీర్లు అందిస్తున్నారన్నారు. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లని.. డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించామన్నారు. నాన్‌ డీబీటీ కలిపితే మొత్తం రూ.3లక్షల కోట్లు అందించామన్నారు. ఒకవేళ ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజాలు చెప్పగలిగిన సత్యసారథులు వాలంటీర్లే అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేస్తున్నారని.. మంచి చేశాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నామన్నారు.
పేదల ప్రభుత్వంపై గిట్టని వారు తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్తున్నారని.. నిందలు వేస్తున్నారన్నారు సీఎం. ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని.. స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి అడుగులు వేస్తున్న మంచి మనుషులని పొగడ్తలు కురిపించారు. ఎవరైనా, ఏదైనా అంటే.. గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట అన్నారు. ప్రజల పట్ల ఆప్యాయతలు చూపించే వాలంటీర్ల విషయంలో చంద్రబాబు ఆపాదించిన దురుద్దేశాలు బాగా గుర్తు పెట్టుకోవాలని.. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి.. తిరిగి జన్మభూమి కమిటీలను తెస్తానన్నారని.. కోర్టులకు వెళ్లి.. అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా వాలంటీర్లు ప్రజలకు చూపించాలన్నారు. 

Name*
Email*
Comment*