పుష్ప 2 మూవీ ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు కు ప్రమాదం

5/31/2023 10:33:14 AM

నార్కట్ పల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. షూటింగ్ ప్రస్తుతం యమఫాస్ట్ గా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడీ చిత్రయూనిట్ కు అనుకోని అవాంతరం ఎదురైంది. ‘పుష్ప 2’ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేనప్పటికీ.. చాలామంది యాక్టర్స్ కు తీవ్రగాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఏం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తొలి భాగం కంటే గ్రాండ్ గా తీస్తున్నారు. అయితే ‘పుష్ప 2’ ఆర్టిస్టులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్ పల్లి దగ్గర బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆర్టిస్టులతో వెళ్తున్న ఈ బస్సును.. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఇన్సిడెంట్ లో పలువురు నటీనటులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన వాళ్లని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
‘పుష్ప 2’లో అల్లు అర్జున్ తోపాటు రష్మిక, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ ఈసారి అంతకు మించి అనేలా సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అంచనాల్లేకుండా 2021 డిసెంబరులో వచ్చిన ‘పుష్ప’ సంచలనాలు క్రియేట్ చేసింది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇలాంటి ఈ టైంలో అనుకోని విధంగా బస్ ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి ‘పుష్ప 2’ ఆర్టిస్టులు వెళ్తున్న బస్ ప్రమాదానికి గురి కావడంపై అల్లు అర్జున్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Name*
Email*
Comment*