తిరుమల, ఎక్స్ ప్రెస్ న్యూస్ మే 31:
ఓ భక్తురాలు తిరుమల శ్రీవారిపై తనకున్న భక్తిని వ్యక్తపరుస్తూ ఏకంగా స్వామివారి చిత్రాన్నే బ్లౌజ్ డిజైన్‌గా మార్చి ధరించడం ఆకర్షించింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ గీతాప్రియకు వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. ఏడాదిలో రెండు, మూడుసార్లు తిరుమలకు వస్తుంటారు. ఇటీవల రూ.12 వేలుపెట్టి చీర కొనుగోలు చేసింది. దాదాపు రూ.35 వేలు ఖర్చు పెట్టి బ్లౌజ్ వెనుక స్వామివారి రూపం వచ్చేలా తయారు చేయించింది. వివిధ రంగుల పూసలు, నూలుపోగులను వినియోగించి స్వామి రూపంతో పాటు భుజాలపై శంఖుచక్రనామాలు వచ్చేలా బ్లౌజ్‌ను కుట్టించింది. మంగళవారం సాయంత్రం శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన గీతాప్రియ బ్లౌజ్‌ను పలువురు ఆసక్తిగా తిలకించారు...