నా కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు ఉరితీస్తా

6/1/2023 11:29:33 AM

 *కొండా మురళి
వరంగల్ జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్ 01: వరంగల్‌లో కాంగ్రెస్ నేత కొండా మురళీ అనుచరులు, వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అనుచరుల మధ్య నిన్న జరిగిన వివాదంపై కొండా మురళీ గురువారం నాడు ఘాటుగా స్పందించారు. తన కార్యకర్తలను టచ్ చేస్తే నాలో పాత మురళీ బయటకు వస్తాడు అంటూ హెచ్చరించారు. తన కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు ఉరివేసి వేలాడదీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖ దే... ఇది రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు. వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరతామని తనతో చెబుతున్నారు. కానీ వారిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొండా మురళీ పేర్కొన్నారు.

Name*
Email*
Comment*