కర్నూలు, ఎక్స్ ప్రెస్ న్యూస్: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు.
మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం ప్రారంభించారాయన. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ.. బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోనే సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ పెట్టుబడి సాయం అని అన్నారాయన..