అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

6/3/2023 4:23:59 PM

 అన్నమయ్య, ఎక్స్ ప్రెస్ న్యూస్ జూన్ 03:
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అధికారులు యాక్సిడెంట్స్ పై ఎంతగా అవగాహన పెంచుతున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన జరిగింది.. ఆ ఘటన ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘోరం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందినట్లు తెలుస్తుంది…

వివరాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో ఈరోజు తెల్లవారు జామున దారుణ ఘటన చోటు చేసుకుంది.. లారీని వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీ కొట్టింది..ఐదుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు..

పీలేరులోని ఎంజేఆర్‌ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తుఫాన్‌ వాహనం నంద్యాల నుంచి తిరువన్నమలైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సను అందిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Name*
Email*
Comment*