మహిళా ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్

6/11/2023 2:54:19 PM


వరంగల్ జిల్లా :జూన్ 11
రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్  సోనాలి మాల్కే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు. శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్ నుంచి స్టేషన్‌లో దిగుతుండగా ఓ మహిళ కాలు జారి కిందపడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమై మహిళ కానిస్టేబుల్ పరిగెత్తుకెళ్లి కిందపడబోయిన ఆ మహిళను కాపాడారు. మహిళ ప్రాణాల్ని కాపాడిన సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణీకులు అభినందించారు. 

Name*
Email*
Comment*