రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడితో విధి ఆడిన నాటకం

6/11/2023 3:05:55 PM

*జైలు శిక్ష అనుభవిస్తున్న తండ్రి


ములుగు జిల్లా:జూన్‌11
ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు. బైక్‌పై ఉన్న వీరిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన కంబాలపల్లి సాయి తరుణ్‌(22) తన మేన మామ కుమారుడు జెజ్జరి అఖిల్‌తో కలిసి సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఏటూరునాగారం మం డల కేంద్రానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఏటూరునాగారంలోని హైవేపై వీరి బైక్‌ను ఓ కారు ఢీకొంది. మంగపేట మండలం కమలాపురం గ్రామా నికి చెందిన వ్యక్తి పెట్రోల్‌ కోసం కారును రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సాయి తరుణ్‌, అఖిల్‌ కింద పడిపోయి తీవ్రంగా గాయప డ్డారు. ఈ ఇద్దరు యువకులను స్థానికులు 108 సహా యంతో ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వరంగల్‌కు రిఫర్‌ చేశారు. దీంతో ఇద్దరిని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో సాయి తరుణ్‌ తుదిశ్వాస విడిచాడు. అఖిల్‌కు వైద్యం అందుతోందని, ప్రాణాపా యం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

సాయి తరుణ్‌, అఖిల్‌ ఏటూరునాగారంలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతు న్నారు. సాయి తరుణ్‌ తండ్రి గణపతి వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డిలో పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తుండగా మావోయిస్తులకు సహకరిస్తున్నాడం టూ ఆయన్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలు కు పంపారు. అఖిల్‌ బాల్యదశలో ఉండగానే తల్లిదం డ్రులు రాథ, సమ్మయ్యను కోల్పోయాడు. ప్రస్తుతం అ తడు పెద్ద అన్నయ్య అశోక్‌ పోషణలో ఉన్నాడు. వ్యవ సాయం చేసుకుంటున్న అశోక్‌ తమ్ముడిని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోషించుకుంటున్నాడు.

*నాన్నకు కడసారిచూపు దక్కేనా..?*

విధి ఆ ఇంటిల్లిపాదిని వెంటాడుతోంది. వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలు వారి పాలిట శాపంగా మారాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన గణపతి మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే కేసులో జైలులో ఉండగా అతడి కొడుకు సాయి తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో తనువుచాలించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది.

కంబాల గణపతి తాను నివసించే గ్రామం గుమ్మ డిదొడ్డిలో పెట్రోల్‌బంకు నిర్వహిస్తున్నాడు. ఇటీవల పలువురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అందులో గణపతి కూడా ఉన్నాడు. ఓ కాంట్రాక్టర్‌కు చెందిన యంత్రాలను మావోయిస్టుల సూచన మేరకు దహనం చేయడానికి కొరియర్లు యత్నించగా వారికి గణపతి పెట్రోల్‌ సమకూర్చాడనే కేసు నమోదైంది. దీంతో ఆ కొరియర్లతోపాటు గణపతిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌పై ఖమ్మం జైలుకు పంపారు. ఇదే క్రమంలో గణపతి కుమారుడు సాయి తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. గణేష్‌కు కుమార్తెతో పాటు కుమారుడు సాయి తరుణ్‌ సంతానం కాగా పిల్లలను ప్రాయోజకులను చేయాలని అతడు ఎన్నో కలలు కన్నాడు. కొడుకు సాయి తరుణ్‌ డిగ్రీ చేస్తూనే తండ్రికి వ్యాపారంలో సహకరించే వాడు. తండ్రి జైలుకు వెళ్లగా పెట్రోల్‌ బంకును సాయి తరుణ్‌ నడుపుతున్నాడు. తండ్రి కోసం ఎదురుచూసిన కొడుకు.. చివరకు కానరాని లోకానికి చేరుకోవడం గ్రామంలో విషాదంలో ముంచెత్తింది.

కుమారుడి మరణవార్త తండ్రి చెవిలో ఇంకా పడలేదు. సాయి తరుణ్‌ అంత్యక్రియల్లో గణపతి హాజరవుతాడా.. కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేస్తుందా.. కొడుకు కడసారి చూపునకు అతడు నోచుకుంటాడా..? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు కాకపోతే ప్రత్యేక అనుమతితో పోలీసుల ఎస్కార్ట్‌ మధ్య కొడుకు అంత్యక్రియలకు తండ్రి హాజరవుతాడా..? అనేది చర్చనీయాంశమైంది.

  

Name*
Email*
Comment*