చిత్తూరు జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్ 12
రాజకీయ రంగ ప్రవేశానికి సినీ నటుడు సప్తగిరి సిద్ధమయ్యారు. తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో సినీ నటుడు సప్తగిరి పాల్గొన్నారు. మీడియా తో తన రాజకీయ అరంగేట్రం గురించి సప్తగిరి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటుగానీ అసెంబ్లీకి గానీ పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. తాను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలోనన్నారు. పేదల కష్టాలు తనకు తెలుసన్నారు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తానని సప్తగిరి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో రావడానికి తన సేవలు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్త శుద్ధితో పని చేస్తానని సప్తగిరి తెలిపారు.