అన్నమయ్య జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్ జూన్ 13: బి.కొత్తకోట మండలం బడికాయల పల్లి గ్రామంలో ఘటన అర్ధరాత్రి ప్రాంతంలో రైతు పసుపులేటి వెంకటరమణకు చెందిన గొర్రెల పాకలో ఉంచిన సుమారు 40 గొర్రెల పై విచక్షణారహితంగా దాడి చేసి తిన్న కుక్కలు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో గమనించిన రైతు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై కన్నీరు మున్నీరవుతున్న రైతు వెంకట రమణ. మాకు ఇంకేం పని లేదా అంటూ చెప్తే తప్ప మేము ఎక్కడికి రాము అంటూ దురుసుగా మాట్లాడిన సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్. సమయానికి పశు వైద్య అధికారులు స్పందించి ఉంటే గొర్రెలు కొన్నయినా బతికి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతు.. చనిపోయిన గొర్రెల సుమారు రెండున్నర లక్షల వరకు ఉందని తెలిపిన రైతు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతు వెంకట రమణ.