హైదరాబాద్, ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్ 13: బాచుపల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశిక.. వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.