షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం

6/24/2023 1:55:48 PM

 ప్రకాశం జిల్లా:జూన్ 24
ప్రకాశం జిల్లాలో ఘోర అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దర్శి పట్టణంలోని అభి షాపింగ్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

వివరాల ప్రకారం.. నగరంలోని అభి షాపింగ్‌ మాల్‌లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చేలరేగి ఎగిసిపడుతున్నాయి. ఇక, అ‍గ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఫైర్‌ ఇంజిన్‌లు అక్కడకి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఫైర్‌ సిబ్బంది గంటకు పైగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అ‍గ్ని ప్రమాదం కారణంగా షాపింగ్‌ మాల్‌లోని బట్టలు దగ్దమయ్యాయి. దీంతో, దాదాపు 2కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.


Name*
Email*
Comment*