ఎస్ ఎల్ ఎన్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య?

6/24/2023 2:00:52 PM


అనంతపురంజిల్లా :జూన్ 24
నగరంలోని ఎస్ ఎల్ ఎన్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలంరేపింది

 ఈ రోజు కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.
కళ్యాణ్ దుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కౌసర్ కూతురు సీమశాధ్య అనంతపురం నగరంలో ఎస్ ఎల్ ఎన్ జూనియర్ గర్ల్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపిసి చదువుతోంది. ఈ సంవత్సరం కాలేజీలో ఓపెన్ అవడంతో ఈనెల 16 వ తేదిన సీమశాధ్య ఆమె స్వగ్రామం నుంచి కాలేజీకి వచ్చింది. అయితే ఈరోజు తెల్లవారుజామున ఆమె కళాశాల ల్యాబ్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం పూట ల్యాబ్ శుభ్రపరచడానికి సిబ్బంది వచ్చి తలుపులు తెరవడంతో సీలింగ్ ఫ్యాన్ కు సీమశాధ్య ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. అక్కడున్న సిబ్బంది వెంటనే కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే కాలేజీ వద్దకు చేరుకున్న పోలీస్ సిబ్బంది సీమశాధ్య మృతదేహాన్ని కిందికి దించి ల్యాబ్ లో మరియు ఆమె గదిలో పరిశీలించారు. కళాశాల వద్దకు తల్లిదండ్రులు విద్యార్థి సంఘం నాయకులు చేరుకొని కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సీమశాధ్య ఆత్మహత్య చేసుకుందని నిరసన తెలియజేశారు. అక్కడున్న పోలీస్ సిబ్బంది వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు...


Name*
Email*
Comment*