కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..

7/7/2023 4:00:07 PM

35 మంది విద్యార్థినుల పరిస్థితి విషమం?

అమరచింత, జులై 07: వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని శుక్రవారం తెల్లవారు జూమున నాలుగు గంటల నుండి విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో కస్తూర్బా విద్యాలయం సిబ్బంది వెంటనే విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియగానే బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ ఫుడ్ పాయిజన్‌ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Name*
Email*
Comment*