అగనంపూడిలో ప్రత్యేక విద్యుత్తు ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని వినతి

7/17/2023 5:06:26 PM


అగనంపూడి - ఎక్స్‌ ప్రెస్‌ న్యూస్‌: అగనంపూడి పునరావాస కాలనీ ప్రజల విద్యుత్‌ వెతలు తీరేలా  ప్రత్యేక విద్యుత్తు ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఎంతో మంది పాడి రైతులకు జీవాలకు అత్యంత ఉపయుక్తమైన పశువైద్యశాల శిథిలావస్థకు  చేరుకుందని, దీనికి నూతన భవన నిర్మాణం చేయాలని, టాటా హోమి బాబా క్యాన్సర్‌ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. గత ప్రభుత్వం తొలగించిన 600 మంది ఆయుష్య ఉద్యోగులను మరలా విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై సీఎం జగన్మోహన్‌ రెడ్డికి గతంలో సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారన్నారు. ఈ విషయమై తగు చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ వినతి పత్రం అందించారు. వీటిపై మంత్రి స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్థానికులకు ఉద్యోగాల విషయమై  లేబర్‌ కమిషనర్‌కు లేఖ రాస్తానన్నారు. అగనంపూడి పునరావాస కాలనీలో ప్రత్యేక విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు విషయమై ఏపీ ఈపీడీసీఎల్‌ఎస్‌ అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల అగనంపూడికి రూ.70 లక్షలతో ఏపీ ఈపీడీసీఎల్‌ ద్వారా ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌లో ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మరు ఏర్పాటు చేసినందుకు, మరియు అగనంపూడి నుండి అనకాపల్లి డిస్టిక్‌ హాస్పిటల్‌కి లేబొరేటరీ సీనియర్‌ టెక్నీషియన్‌గా బదిలీ అయిన సందర్భంగా అగనంపూడి ఏడిసీ చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ, పిల్లా రాజశేఖర్లు పూల గుచ్ఛం అందించి కృతజ్ఞతలను తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తోకాడ రాము, అగనంపూడి  నిర్వాసిత నాయకులు పిల్లా రవి, టిడిపి నాయకులు ఎస్‌ శంకర్రావు, అనకాపల్లి డిస్టిక్‌ హాస్పిటల్‌ ల్యాబ్‌ సీనియర్‌ టెక్నీషియన్‌ పిల్ల రాజశేఖర్‌, ఆయుష్‌ పారామెడికల్‌ ఎంప్లాయిస్‌ ప్రతినిధి శ్రీమతి సబ్బి నిర్మల పాల్గొన్నారు.


Name*
Email*
Comment*