భద్రాచలం జిల్లా, జులై 18: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. సోమవారం వరకు 13 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వరదనీరు వచ్చి తాలిపేరు ప్రాజెక్టులో చేరుతున్నాయి. ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 9,000 క్యూసెక్కుల వరద నీటిని దిగునున్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరులశాఖ అధికారులు తెలుపుతున్నారు. రేపటికి గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారుల అంచనా.
*నిలిచిన బొగ్గు ఉత్పత్తి
వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు తీసే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా.. సింగరేణి అధికారులు నీటిని మోటర్ల సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు. మొత్తం భూపాలపల్లి వ్యాప్తంగా 503.8 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు....