నకిలీ నక్సల్స్ డమ్మీ తుపాకులతో హల్ చల్

7/22/2023 1:19:30 PM

ములుగు జిల్లా :జులై 22
జిల్లాలో నకిలీ నక్సల్స్ శుక్రవారం రాత్రి హల్ చల్ చేశారు. నక్సల్స్ అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ములుగు జిల్లా వెంకటాపురంలో నకిలీ నక్సల్స్‌ను అరెస్ట్ చేశారు. నిందితులు నక్సల్స్‌మని చెప్పి డమ్మీ తుపాకులతో ఇసుక వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు తెలిసింది దీంతో పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు.  సురేష్, రాజేశ్, మంగులు గా గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు డమ్మీ తుపాకులు, రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Name*
Email*
Comment*